Saturday, July 13, 2024

లలిత గీతాలు 30-12-23 శీర్షిక - కలము.

 లలిత గీతాలు 

30-12-23
శీర్షిక - కలము. 

 కలము గళము కలగలువగ
 కలిగెనోయి మనమున హాయి ... 

ఎదకొయిల రాగాలకు 
 కూజితమే బాణీలు 
 మధురమైన కవనతేనియ 
 జాలువారు గలములలో... 
         // కలము // 
వివిధమైన విషయాలు 
వింతగొలిపే సంబరాలు 
 వైవిద్యతల భూషణాలు 
వరుసకలుపు పదబంధాలు ... 
       
      // కలము // 
 మదిలోని భావాలకు 
 మేనులోన గిలిగింతలు 
 పెదవులపై నాట్యమాడు 
 మానసము పులకరించి ... 
         
      // కలము // 
 నేటి కవితా సమూహమున 
 మేటి సాహితీ మూర్తులలో
టంచనుగా వారమున
మింటికెగిసె అలరించగా ... 
      
      // కలము // 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment