అందరు మంచివాళ్ళే
తేది: 20-05-2024
శీర్షిక : సత్తా ఉన్న శాంతిమంత్రం ....
నోరు మంచిదైతే ఊరంతా మంచిదే ..
మననుండే మొదలవ్వాలి
స్వార్థమెరుగని సౌభ్రాతృత్వం
సమన్వయమైతే విశ్వజనీనతేగా ... కానీ
అందరు మంచివారైనా
పరిస్థితులు పరీక్షలు పెడతాయి ....
కొన్నిసార్లు అందరు శాఖాహారులే
గంపకింది కోడి మాయమైనట్టు ....
లోకో భిన్న రుచి... విభిన్న రుగ్మత
కపటత్వం కంఠహారంగా కొంతమంది
కక్షలు కార్పణ్యాల మిర్యాలతో కొందరైతే
అదనుకోసం ఎదురుచూసే గుంట
నక్కలు ఇంకొన్ని...
హరివిల్లులో అసలువి సప్తవర్ణాలై నా
విరిజల్లుల్లో వేనవేలు కానవస్తే ....
వస్త్రపరిశ్రమలో కనపడే లక్షల రంగుల్లా
మనిషి ఆకారాలు ... అంతరంగాలు ...
ఏదేమైనా యథా రాజా తథా ప్రజా
మంచి మలయమారుతంలా
విస్తరించాలి ...
మంచి గంధం
మల్లె పరిమళాలలా పరుచుకోవాలి .....
సత్తా ఉండి శాంతి మంత్రం
పఠించగలిగితే ఫలితం వందరెట్లు .....
లేదంటే చేతకాని తనంగా
చిత్రీకరించుకుని భస్మాసుర
హస్తమౌతుంది ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment