Friday, July 26, 2024

చిత్ర కవిత (వరద నీటిలో బోర్లించిన పాత చెప్పుపై రెండు కోడి పిల్లలు) - 26-05-2023 శీర్షిక : చెట్టుకోటి పుట్టకోటి

 చిత్ర కవిత (వరద నీటిలో

బోర్లించిన పాత చెప్పుపై రెండు కోడి పిల్లలు) 
తేది: 26-05-2023
శీర్షిక : చెట్టుకోటి పుట్టకోటి 

చెట్టుకొకరు పుట్టకొకరు 
చెల్లాచెదురైన జీవితం 
ప్రకృతి విపత్తుకు 
పలాయనమై కాపాడుకున్న పాణం...  

తల్లి రెక్కల్లో పొదువుకోవాల్సిన 
చంటి పాపలు  దారి తప్పి
తల్లడిల్లే...పిల్ల ప్రాణాలు 
గజగజ వణుకుతూ  ఓ పక్కన .. 

బిక్కు బిక్కు చూపులతో 
భీకర సన్నివేశం ... కడుపు 
నింపుకునే సత్తా లేదు ... 
కాలు కదిపే పరిస్థితి లేదు .... 

కాల యవనికలో జరుగుతున్న  
కలి మాయల ప్రపంచంలో 
మనుషులకే దిక్కులేని 
మాయా ప్రపంచం..ఇక 
పశుపక్ష్యాదులకెక్కడ ? 

బుంగలో దొరికిన దుంగలా 
పాత చెప్పైనా ప్రాణాలకు 
ఊతమై నిలిచే ... పట్టుపరుపై 
తోచే ... పసి పిల్లలకు .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment