నగునూరి రాజన్న
అంశం : దివ్యాంగులు
తేదీ : 19 - 12 - 2018
శీర్షిక : నిజ మార్గదర్శకులు
సంఖ్య: 108
సర్కారులో సేవకుడైతే గొప్పేంటి
సాధారణ పౌరుడైతే ఒప్పేంటి
సర్వాంగాల సహకారమున్నా
సహృదయత లేదంటే
సంఘములో అనామకులే...
సర్వాంగసుందరుడైతే మాత్రమేంటి
సర్వోన్నత సుర సములైతే మాత్రం...
కన్న తల్లిదండ్రులను
కడదాక కాచనివాడు
చెల్లని కాసు సముడే..
తోటి మనిషిని
చల్లగచూడలేని
కళ్లుండి లాభమేంటి .....
సాటి ఆడపిల్ల
సౌశీల్యతను లెక్క చేయని
గుణముంటే గొప్పేంటి........
కాలు చెయ్యి లేకున్నా
కత్తిలాంటి పదనున్నది....
ఆటా పాటల్లో ..........
కన్ను ముక్కు బాగోకపోయిన
కమ్మని మనసున్నది....
సర్వాంగులకన్నా............
అందుకే దివ్యాంగులే మిన్న
సర్వాంగులకన్నా...........
నిజమార్గదర్శకులు
ఈ జగాన..................
నగునూరి రాజన్న.