నీకు నీవే సైన్యం
తేది 17-06-2024
శీర్షిక : చరిత తిరగ రాయుము ...
ఎవరో వస్తారని ఎదురుచూడకు
ఏదో చేస్తారని ఆశపడకు ....
పద పదరా సోదరా అన్న కవి పలుకుల్లా
పద ముందుకు కదులుమురా
ఎద నిండా మనోధైర్యముతో ...
వినుము అందరి సలహాలు
కనుము నీకు నీవే నిర్ణయం ...
కనుమరిగించు అనుమానాలు
ఎదురించు అపనమ్మకాలను ...
నీకు నీవే ఎపుడు గొప్పగా ఊహించు
వేరెందుకు ఇకను చెప్పడం ...
నిన్ను నీవు గుర్తెరగవు ఏల
నమ్మలేవు మారుతిలాగా ....
మనసు కేంద్రమై మాట చెప్పినా
మర్మమేమిటో మూట విప్పినా ....
గుండెధైర్యం కన్నా మించినది లేదు
ఆత్మస్థైర్యం కన్నా గొప్పేది కాదు ....
తగనే తగవు నీకు న్యూనతమ్ములు
తలువుమా సామర్థ్యమ్ములు ...
తోడు నిలవరా తదాస్తు దేవతలు
కూడ వచ్చును గుర్తింపులు ....
గగనమైనా భీతిల్లకు సుమా
గమ్యమెఱిగి చరించుమా ...
గమనమొక్కటి ఎన్నుకొనుము
విజయం నీ దరి చేరును ....
ఒక్కసారి విజయాన్ని ముద్దాడవో
విశ్వమే అనుసరించు నిన్ను…
జగతి నిను గుర్తించు ప్రత్యేకమై
భవితను నువు నిర్మించుకో ....
పదులలో ఉదాహరించే విధముగా
చరితను తిరగ రాయుము ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment