చిత్ర కవిత
తేది : 24-06-2024
శీర్షిక : నిరీక్షణ ఫలించేనా ...
ఒక్క భంగిమకే వేవేల భావాలు
ఏమది ఎంత విచిత్రం ...
శిఖన ముడిచిన మల్లెలు
దోసిలిలో దోబూచులాడే ...
మేని వర్ణానికి మేలి ముసుగులా
శ్వేతవర్ణపు వస్త్రం ...
మాట ఏదో చెప్పాలనే ఆరాటం
ఎవరనేది ఊహకే పరిమితం ...
ప్రేయసివా లేక ఊర్వశివా
సఖునికొరకు సరాగాలా ? లేక
సంధ్య వేళలో సరిగమలులా
పెనిమిటి రాకకై నిరీక్షణలా ? ...
మండే గుండెకు మల్లె చెండుతో
మంచు స్పర్శలను చల్లడమా? ...
మారుతములో పరిమళాలను
పరిచయించి వెదజల్లడమా ? ...
నిరీక్షణలు నిర్విగ్నమగునా
పరీక్షా సమయాలు ఫలించేనా...
కాలమే సమాధానమై
కనికరించి కరుణించునా ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment