Friday, July 26, 2024

మరుమల్లెల సౌరభాలు తేది : 24-05-2024 శీర్షిక : పరిమళాలు వీచితే ....

 మరుమల్లెల సౌరభాలు

తేది : 24-05-2024
శీర్షిక : పరిమళాలు వీచితే .... 

కూకేడు పాము కుందేలు పిల్ల 
ఎలా అయిందబ్బా అని విశ్వమంతా 
విస్తుపోతుంటే ... విజయ గర్వమే  
కించిత్ వీనులకు విందుగా పసందుగా .... 

కుక్క తోక ఎప్పుడు వంకరలా 
అలవాటైన ప్రాణం అలితేరినట్టు 
కుదురుగా కూర్చోనీయక దశాబ్దాలుగా
కుదేలయింది దేశమంతా.... 

అవినీతి బంధుప్రీతి అంటకాగి 
గాలికొదిలిన ప్రజాక్షేమాలతో 
కింది నుండి పైదాకా రాజ్యమేలి 
లంకా దహనమే మిగిలింది .... 

శిశుపాలుని నూరు తప్పుల్లా 
డెబ్బడేండ్లలో వంచనలే అన్నీ 
గుండు సూదైనా గాలిమోటారైనా ... 
బండ రాయైనా బతుకుదెరువైనా ... 

విశ్వమంతా కోడై కూస్తున్నా..విస్తుపోయిన 
జనమంతా చెప్పుకుంటున్నా…
కుహనా వాదుల కుంటి సాకులతో…
కుటిల బుద్దులతో… ఒంటిమీద తేళ్లు జెర్లే...  

అది ఇది అనే తేడా లేకుండా 
అన్నింటా పురోగతి సాధించి చూపుతుంటే 
నిష్కల్మష పాలనలు…నిరంతర 
పురోభివృద్ధి… నిత్య పొగడ్తలు ...మనసు నిండా… 

మరిప్పుడెలా సాధ్యపడింది
పదేండ్లలో డెబ్బదేండ్ల పనితనం ... 
దేశమంటే దేహమనే భావనలు
మరు మల్లెల సౌరభాలై విచ్చుకుంటేనే  
పరిమళాలు ఎల్లెడలా  వీచితేనే 
ప్రగతి ప్రతీ రంగంలో  విస్తరిస్తుంటేనే ....సాధ్యం… 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment