Saturday, July 27, 2024

తాపత్రయాల కడలి తేది 28-06-2024

 తాపత్రయాల కడలి 

తేది 28-06-2024
శీర్షిక : 

గిరి గీసుకున్నట్టు బరిలో 
నిలిచిన ...అలల తరంగాలతో 
నిత్యం ఆరాటాల పోరాటమే.... 
బొడ్డుమల్లెల్లా ఒడ్డు చేరాలని .... 

గడ్డు రోజులే కాలుష్యాలతో 
ఇంటా బయటా కాలువలలో 
నదులలో సముద్రాలలో 
కోరలతో బ్రహ్మ రాక్షసిలా .... 

మనిషి ప్రమేయమున్నంత దాకా 
కబంధ హస్తం చాచుకుని 
కళ్లెం తీసిన అశ్వంలా దూసుకెల్తూ 
విశ్వమంతా విపరీతమే .... 

నిజానికి జీవరాశి కంతకు 
బీజమే హక్కులు బాధ్యతలు 
ప్రకృతిని పరిరక్షించడంలో 
అన్నింటిని కాలదన్నే మనిషి .... 

అహం బ్రహ్మాస్మి మనిషికి....  
శాపం జీవరాశికి ... వినమ్రుడై 
వివేకాలతో ప్రయత్నిస్తే  వింతలు 
సృష్టించవచ్చు ....అనుభూతులు 
ఆస్వాదించవచ్చు... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment