Wednesday, March 14, 2018

మస్తిష్కపు మతలబులు



అదే పనిగా ఆలోచిస్తూ కలత నిద్ర పొందాను 
తెల్లవార్లూ తేలిపోతూనే ఉన్నాను 
అలలు అలలుగా, తెరలు తెరలుగా 
మస్తిష్కపు నీలి ముసుగుల నీడలలో 
మత్తు వదిలించుకుని ఒక్క ఉదుటున లేచి 
ఒడిసి పట్టుకుందామని ఓలలాడాను 
ఓ చక్కని రూపమిద్దామని ప్రయత్నించాను 
అర్థవంతమైన సందేశంగా ఆవిర్భవించనిదే ... 
అరవిరిసిన నయనమోడ్పులవలె 
ఆగమ్యగోచరముగా అల్లంత దూరాన దోబూచులాడినది 
సంశయముగా, సందిగ్దముతో  , భయముగా, భక్తితో
కాగితము మీద కలముతోనైతే స్వారీ చేయించగలిగాను  కానీ 
దేవుళ్ళకు  అదేనండి........ 
పాఠక దేవుళ్ళకు సంతృప్తిని పంచగలుగుతుందో లేదో..... 

జాషువా గారి సమగ్ర సాహిత్యం


జాషువా గారి సమగ్ర సాహిత్యం

అంధకారములో  అరవిరిసిన కమలము 
అమ్మ భాషలో పురి విప్పెను గళము 
అనన్యమైన అధ్బుత రచనలతో 
అంబరాన్ని చుంబించాడు అర్ధ శత వత్సరములు 

మసక చీకటి తాను అనుభవించి 
మణి వెలుగులిచ్చెను దివ్య రేడులా 
మాతృ భాషకు ఓ మైలు రాయిగా 
మలిచినది జాషువాగారి  కవితా  యుగం 

రవి గాంచని చోటు కవి గాంచునన్నట్టు 
రమ్యమైన ప్రకృతి ప్రాణ కోటిలో 
రచనా కోణమైనది గబ్బిలము సైతం 
రచయితల నెందరినో రక్తి కట్టించి నిలిచింది 

నాస్తికతను  తాను  నమ్మి సమర్ధించినా 
వాస్తవాలను సవివరముగా ఆవిష్కరించారు
బూర్జువాలను కవిగా  ఎదిరించినా 
సున్నితముగానే  సృషించారు 

పదనిసలై పారినవి వారి కవితా పల్లవులు 
పరమ శ్రేష్ఠునిగా అభినందించ బడ్డాడు 
పద్మ పురస్కారం తానుగా వరించినది 
పరమ పూజ్యుని చరితకు నేను సైతం 

అనాథ


అనాథ అనగానే అందరూ ఆలోచించేది -
అమ్మా నాన్నలు గాని, పిల్లలు గాని 
ఆదరించే వారు అందుబాటులో లేని
ఆడ,మగ, పిల్లా, పాప, ముసలి ముతక 
ఆది గాగల అందరూ అంటూంటారు  కానీ 

సంఘ జీవనములో సంచరిస్తూ నే 
సంస్కారాలు,సంప్రదాయాలు,చరిత్రలు మరిచి 
సమాజానికి కంటకమై, ఆటంకమై 
స్వార్ధానికి మాత్రమే ప్రాధాన్యమిచ్చి 
సత్మానవత  సమర్దించని వాడు, సృశించని వాడు 
అసలు సిసలైన అనాథ 

మహా శివాయ


నమశ్శివాయ: ఓం నమశ్శివాయ:
నమశ్శివాయ: ఓం నమశ్శివాయ: 

గౌరీ ప్రియాయ హర గంగాధరాయ 
దిగంబరాయ హర  జటాధరాయ 

త్రినేత్రాయ హర త్రిశూలధరాయ 
నీల కంఠాయ హర చంద్రశేఖరాయ 
 
విరూపాక్షాయ హర విశ్వంభరాయ 
రుద్రనమకాయ హర ఢమరుకనాధాయ  

నమశ్శివాయ: ఓం నమశ్శివాయ:
నమశ్శివాయ: ఓం నమశ్శివాయ:

అర కొర స్వాతంత్య్రం ఆడవాళ్లకు


అర  కొర స్వాతంత్య్రం ఆడవాళ్లకు 

అమ్మ,అక్క,చెల్లి,ఆలి అందరు బాగుండాలి... కానీ 
అవతలింటి ఆడపడచంటేనే అందరికి లోకువ 
అసూయ చెందుతారు సాటి మనుషులు 
ఆటంకాలతో అణిచివేత  ప్రయత్నాలు చేస్తారు 

పల్లె పడతికి సరైన సౌకర్యాలే లేవు 
పట్నం పడతికి పౌర సహాయం దొరకదు 
పడీ....  లేచి....  ఓ పదవి వెలగబెడుతుంటే 
పక్క వాళ్ళే పగలు పెంచుకుంటారు 

ముప్పయ్యారు జుట్లు జట్టుగుంటాయి కానీ 
మూడు జడలు కలువవనే సామెత లా 
మగవాళ్ల విషయం పక్కన పెడితే 
మగువల ఆరాటం ముందు సాటి మగువలు గుర్తించాలి 

పడతులు విద్యావంతులైతే 
పండంటి కాపురాలు బలపడుతాయి 
పరిణతి కలిగిన సంఘమేర్పడి 
ప్రయోగ యుక్తమైన దేశంగా అభివృద్ధి చెందుతుంది 

అమాత్య పదవులేం కాదు 
అసలు MP,MLA,MLC లు కూడా కాదు 
ఆఖరుకు వార్డు మెంబరు కావాలన్నా 
ఆరక్షణ శాతం వర్తించాలంటున్నారు 

అనేక సేవా రంగాలలో ఆరి తేరి నిలిచారు 
అనన్యమైన సేవలందిస్తూనే ఉన్నారు 
అష్ట కష్టాలు పడి అంతర్జాతీయ క్రికెట్టు గెలిస్తే 
ఆదరించండని అడుక్కోవాలా.. ఇదెక్కడి న్యాయం 

రామ రాజ్యంగా రంజిల్లాలంటే 
గాంధీజీ కలలు సాకారం కావాలంటే  
కొసరి వడ్డింపుల కొనసాగింపు కాదు 
అసలు వాటా అర్ధ శాతం ఆడకముందే ఇవ్వాలి....  

అద్దె ఒడిలో అమూల్యమైన బాల్యం


అద్దె ఒడిలో అమూల్యమైన బాల్యం 

మత్తు మందుల కలల క్రీనీడలలో 
గమ్మత్తు ఉందనే గజి బిజి ఆలోచనలతో 
సోంబేరి యువత పెడదారిన పడుతూ, దేశ 
భావి పునాదులకు బీటలు వేస్తున్నారు 

ఆరి తేరిన కర్కశ  చోర కలలతో 
అమ్మా నాన్నల ఆలనలో ఉండాల్సిన 
అభం శుభం తెలియని పసి కూనలను 
అలవోకగా ఎత్తుకెళ్ళి అమానవీయతకు పాల్పడుచున్నారు 

అద్దెకిచ్చిన అమ్మ ఒడిలో 
మత్తు మందులతో జోల పుచ్చుతూ
ఆ బాల్యాన్ని బందీమయం చేస్తూ   
మానవతను మంట కలిపి జోలె చాపుతున్నారు 

అడ్రస్ లేని ఆలసే  సోంబేరులు 
అగణిత సంచార క్రూర నర జాతులు 
అక్కున చేర్చుకుంటున్నారని అంచనా
అనులోమాను పాతమై అభివృద్ధి చెందుచున్నది 
అద్దె ఒడిలో అమూల్యమైన బాల్యం 

రంగులు మార్చే రాజకీయాలు  కాకుండా 
లంచాలకు చిరునామాగా మారే  గణాలు  కాకుండా 
సదన సౌకర్యాలు  సమృద్ధిగా  సమకూర్చుకుంటూ 
సంకర మానవ రాక్షసులకు అడ్డుకట్ట వేస్తేనే   
స్వర్ణ భారతిని సాదరముగా అందించవచ్చు  భావితరాలకు   

విళంబి ఉగాది

ఆరు రుచుల ఆది పర్వము ఉగాది 
అరుదెంచెను కవలలైన తెలుగు వారికి శుభమై 
ప్రభవ విభవాది వత్సరాల కాల చక్రములో
పదిలంగా చేరుకున్న "విలంభి" నీకిదే మా ఆత్మీయ ఆహ్వానం 

సర్వజిత్ లో స్వాతంత్య్రం వచ్చినా 
సాకారం కాలేదు సాధారణావసరాలు సైతం 
పంచ వర్ష ప్రణాళికలతో ప్రయాణం మొదలైనా 
పంచలేదు పరిమళాలు పదుగురి బ్రతుకులలో 

సాధు శీలి జాతి పిత కల నెరవేరలేదీనాటికీ 
సకల జనులకు ఆరోగ్యం, విద్య , సంక్షేమం 
సర్వమతాదరణే తన అభిమతమన్నారు 
సానుకూలం కాలేదు డెబ్బయ్యేండ్లయినా 

వందలేండ్లు పరుల పాలనలలో మగ్గినా 
వదలడం లేదు మన నేటి పాలకుల జాఢ్యం 
వంత పాడి గెలుస్తూనే ఉన్నారు ఐదేండ్లకోసారి 
వడి కలిగిన అభివృద్ధికి గురి కలిగిన పాలనేది ?

అధికారం, ఆస్తుల కూటమే కొందరికి 
అతలా కుతలం ఆరుగాలం అవని దున్నే రైతన్నకు 
మద్దతు ధరల విషయములో ఏమాత్రం 
మారలేదు పాలకుల నీటి పైన మాటలు
మాతృ భాషా ఉత్సవాలతో మారు మ్రోగించినా 
మాతృ మాతలు (తెలుగు తల్లి,తెలంగాణ తల్లి) ఘోషించదా 
అతివలకిస్తామన్న అర  శాతం పాలనాధికారం 
అంకురం నుండి అమలు దశ చేరలేదని
సంపద కేంద్రీకృతమయ్యే స్వామి కార్యాలు,  
సరిహద్దులు దాటించే దారిద్య్రపు సంస్కృతుల
సుడిగుండాలలో తాము, తమ వారు సైతం 
సావాసులమేనన్న  సత్యమెప్పుడు గుర్తిస్తారు (లంచగొండి అధికారులు )

అత్యధిక ఉపగ్రహాలు అనుసంధానించి 
అంతరిక్ష శిఖరాగ్రాలు అధిరోహించడమే కాదు 
అధ : పాతాళానికి కూడా చేరువయ్యాము 
అన్నపూర్ణనందించే రైతన్నలపై లాఠీలు  ఎత్తి 

పొరుగు క్షేమం పొందు లాభం కోరే 
పొల్లు పోనీ ఘన పాలకులుంటే ఏమి లాభం
సొల్లు కార్చే లంచ గొండి తనంతో 
ఇల్లు గుల్ల చేసే వల్లమాలినోల్లుండగా 

ప్రకృతి ఒడిలోనే ప్రజల శాంతి వెదికి  నిలిచే 
పరమ వీర జవానులకేమో లెక్కలేసిన జీవన భృతులు 
పదవి ఒక్క సారి వెలగ బెట్టిన పాలకుడైతే చాలు 
పంచుకుంటున్నారు కోట్ల అలవెన్సులు జీవితాంతం.  

పేదల పెన్నిదైన రైలు ప్రయాణాలు 
ప్రజల గుండెల్లో పరుగెడుతున్నవి రక్షణ కరువై 
పరిమితి మించిన ప్రమాదాలు జరిగినా 
పని తీరులో పరిణతి పెంచుకోలేక సతమతమౌతూనె ఉన్నాము

పెద్దనోట్ల రద్దుతో ముద్దైన నల్ల ధనం మాటేమోగాని 
నగదు కొరతైతే నానాటికి లభ్యత లేనే  లేదు 
పన్నులన్నీ ఏకీకృతమంటూనే జి  ఎస్  టి  తెచ్చారు 
పరోక్ష పన్నులనేకం పెంచి బాదుతూనే ఉన్నారు ప్రజల నెత్తి పైన

పరుగున రావమ్మా విళంబి 
పావనమై నిలువమ్మా సాధారణ పౌరునికి  
హేవళంబి లోని విళంబాన్ని  తీర్చుతూ  
హెచ్చులెరుగని  పౌరుని కోర్కెల చిట్టా