అంశం : పట్టణ జీవితం
తేదీ : 06 -10 -2018
శీర్షిక: సిసలైన సిటీ లైఫ్
సంఖ్య: 72
పట్టణ ప్రజా జీవితాలన్నీ
పటాటోపమయమే మిత్రమా!
కాలంకంటే వేగమయిన పరుగులతో
కరుగిపోతున్నాయి మానవ సంబంధాలు!
కలిమాయ కబంధ హస్తాల్లో చిక్కుకుని వేలాడుతున్నాయి సుమా....
ప్రమాదపుటంచున ప్రధూషణాలతో....
పక్కా కాలుష్య కల్తీల కీకారణ్యంలో.....
ప్రమాదకూటముల పయన మార్గములతో....
ప్రాణం నిలుపుకుంటున్నారు గత్యంతరంలేక
పచ్చని చెట్ల కరువు కాటకాలతో....
ప్రాణవాయువు సైతం పరహాసించే కాంక్రీట్ జంగల్లలో.......
పక్కింట్లో ఏమయినా పట్టించుకోరు!
పలుకరింపులకు సమయం దొరకదు!
ప్రతిరోజు పదుల జనాలతో తారసపడినా....
పచ్చి మోసాలతో ప్రతిరోజూ కత్తిమీద సామే.
పది తర్వాత ఏరాత్రికో గాని గూటికి చేరరు.
ఎవరూ ఎవరిని పట్టించుకోకపోయినా.....
ఎవరో వాళ్ళను తరుముతున్నట్టు!
ఎవరి కొరకో వీళ్ళంతా పరుగెడుతున్నట్టు!
ఎందుకో తొందర చిందర వందర....
ఎందుకూ కొరగాని బతుకులు.
వచ్చేపోయె వాళ్ళతో మాటముచ్చటకు జాగ!
వండుక తినటానికో వసారా!
ప్రకృతి కార్యాలకు పరస్తుపరం...
మరబతుకుల మలి సేదలకో గది!
ఎవరైనా బంధువొస్తే ఎదురుసూపులే ఎప్పుడు పోతాడాని?
సందు బొందుల్లల్ల సరైన సౌకర్యాలు లేక
సంధ్య, రాత్రులందు సరుకు దోపిడీలకై
సడేమియాల్లాంటి సన్నాసి టక్కరోల్లుండ....
సర్కారోళ్ళు గూడ సదరబట్టిరి....
పండగల పబ్బాల ప్రయాణ చార్జీల మీద!
నగునూరి రాజన్న
తేదీ : 06 -10 -2018
శీర్షిక: సిసలైన సిటీ లైఫ్
సంఖ్య: 72
పట్టణ ప్రజా జీవితాలన్నీ
పటాటోపమయమే మిత్రమా!
కాలంకంటే వేగమయిన పరుగులతో
కరుగిపోతున్నాయి మానవ సంబంధాలు!
కలిమాయ కబంధ హస్తాల్లో చిక్కుకుని వేలాడుతున్నాయి సుమా....
ప్రమాదపుటంచున ప్రధూషణాలతో....
పక్కా కాలుష్య కల్తీల కీకారణ్యంలో.....
ప్రమాదకూటముల పయన మార్గములతో....
ప్రాణం నిలుపుకుంటున్నారు గత్యంతరంలేక
పచ్చని చెట్ల కరువు కాటకాలతో....
ప్రాణవాయువు సైతం పరహాసించే కాంక్రీట్ జంగల్లలో.......
పక్కింట్లో ఏమయినా పట్టించుకోరు!
పలుకరింపులకు సమయం దొరకదు!
ప్రతిరోజు పదుల జనాలతో తారసపడినా....
పచ్చి మోసాలతో ప్రతిరోజూ కత్తిమీద సామే.
పది తర్వాత ఏరాత్రికో గాని గూటికి చేరరు.
ఎవరూ ఎవరిని పట్టించుకోకపోయినా.....
ఎవరో వాళ్ళను తరుముతున్నట్టు!
ఎవరి కొరకో వీళ్ళంతా పరుగెడుతున్నట్టు!
ఎందుకో తొందర చిందర వందర....
ఎందుకూ కొరగాని బతుకులు.
వచ్చేపోయె వాళ్ళతో మాటముచ్చటకు జాగ!
వండుక తినటానికో వసారా!
ప్రకృతి కార్యాలకు పరస్తుపరం...
మరబతుకుల మలి సేదలకో గది!
ఎవరైనా బంధువొస్తే ఎదురుసూపులే ఎప్పుడు పోతాడాని?
సందు బొందుల్లల్ల సరైన సౌకర్యాలు లేక
సంధ్య, రాత్రులందు సరుకు దోపిడీలకై
సడేమియాల్లాంటి సన్నాసి టక్కరోల్లుండ....
సర్కారోళ్ళు గూడ సదరబట్టిరి....
పండగల పబ్బాల ప్రయాణ చార్జీల మీద!
నగునూరి రాజన్న