అతడు ...ఆమె ...ఓ తీయని జ్ఞాపకం ...
తేది 26-06-2024
శీర్షిక : శుభం కార్డు
కలువ కన్నుల కాంతను
చూసిన క్షణమే చుక్కలా మెరిసింది ...
ఆలోచనలల్లుకుని అవనిపై
కాలు చేయి నిలువనీయక
కులుకు పలకరించింది ...
మనమున బీజమై మననంతో
ఘనమౌతూ కాలంతో పాటుగా
కమనీయమై కలవరింతలైంది ....
నన్ను నాలో లేకుండా చేసింది
కలల సౌధాలను కబళిస్తామని
కలువలు తామరలు గుసగుసలు
పోతుంటే ... తెలిసిన బంధమైనా
తెలుసుకోవడానికి జీవితం ...
ఉపాధి దాకా ఉగ్గబట్టి
స్థిరమయ్యాక గాని స్వరం
పెగల్లేదు ... అమ్మానాన్నలకు
కూలంకషంగా చెప్పి ఒప్పించ...
అపుడపుడు ఊహలకు
రెక్కొలొచ్చి ముంగిట వాలిపోదామని ...
అంతలోనే సర్దుకుని తేరుకుని
కలల వాకిట నిలవొద్దని పారాహుషార్ ...
మా ఆరాటాల పోరాటాలకు
ఆత్మీయ బంధువులంతా
కలిసి ఓ మంచి శుభముహూర్తాన
సుందరమైన శుభం కార్డు వేశారు .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment