ధూమపానం
తేది 31-05-2024
శీర్షిక : స్వీయ నియంత్రణలు
పాన్ మసాలా చుట్టా బీడీ సిగరెట్టు
కాన్ కోల్కే సునో ... వాటి పని పట్టు ....
నిరక్షరాస్యతలు కొంత
నిర్లిప్తతలు మరికొంత
సోపతుల ఆట పాటలతో ఆరంభం
మొహమాటాలతో ప్రియబంధం ...
వ్యసనాలకు పెద్ద పీట వేస్తే…
ఊపిరిబిగపట్టి హుషారుగా
రింగులు రింగులు ఊదుతూ
మజాల పర్వం అనుకుంటారు
ఊపిరితిత్తులకే మోసమని తెలుసుకోరు ....
చూడర బాబు డాబు దర్పం అంటూ
సూటు బూటుల సిగరెట్ పర్వం ....
నాటు తనాల చుట్ట బీడీల గర్వం ...
వెనక దాగిన మోటు సరసం తెలుసుకోరు ...
చుట్ట బీడీ సిగరెట్ తాగువారికన్నా
చుట్టూ పీల్చువారికే అపాయం ....
కట్ట కట్టుకుని కనికరించు చుట్టాలను
పక్కాలను ...అందిరిని అనారోగ్యా లు.....
పట్టీ పట్టని ప్రభుత్వాలు
ఆదాయాలకు మార్గమేసుకుని ...
అనారోగ్యాలకు మూలమయ్యే
అలవాట్లను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాయి ....
అనుభవాల ప్రోదిలో
మంచి చెడులనెంచుకుని
స్వీయ నియంత్రణలే శ్రీరమ రక్షగా
మనకు మనమే మార్గమెంచుకోవాలి
మంచి మార్గమున పయనించాలి
ఆరోగ్యమే మహాభాగ్యమంటూ ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment