Friday, July 26, 2024

సంఘం శరణం గచ్చామి తేది : 23-05-2024 శీర్షిక : బుద్ధం ధర్మం సంఘం

 సంఘం శరణం గచ్చామి

తేది : 23-05-2024 
శీర్షిక : బుద్ధం ధర్మం సంఘం

ఈనాటి రాజకీయ నాయకుల్లా 
సుఖభోగాలలో మునిగి తేలే 
అవకాశమున్నా...వదులుకుని 
జీవన ఆంతర్యమేంటో అవపోశన 
పట్టాడు.  

అనతి కాలంలోనే బుద్ధగయలో 
బోధి వృక్షం నీడలో జ్ఞానోదయం 
అంచెలంచెలుగా విశ్వవ్యాప్తం 
అష్టాంగ మార్గమే శరణ్యమనెను .... 

సర్వమానవ సౌబ్రాతృత్వాన్ని 
చాటాడు. అహం వదులుకుని 
మానవత్వం వంపుకుని 
బోధనలు నింపుకుని సాగాలి ... 

సంసార బంధాలను త్యజించి 
నిత్యజీవన విధానంపై విరక్తితో 
అమరత్వమును సాధించుటయే 
జీవిత పరమార్థమని శోధించే .... 

సాధించిన విజ్ఞానాన్ని సంశయం 
వదిలి మొదటగా వారణాసిలోని 
సారనాధ్ నందు మొదటి ఘట్టంనకు 
అడుగు పడినది ....ధర్మచక్ర ప్రవత్తన్  గా ... 

బుద్ధం ధర్మం సంఘం గా పరిణమించి 
అంచెలంచెలుగా విశ్వవ్యాప్తి చెందడంలో  
కృతకృత్యుడయ్యాడు .... నేటికీ ఎన్నో 
దేశాలలో బుద్ధుని నీడలు సాక్ష్యం .... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment