Friday, July 26, 2024

యోగామృతం తేది : 21-06-2024 శీర్షిక : ఆరోగ్య గుళిక

 యోగామృతం 

తేది : 21-06-2024
శీర్షిక : ఆరోగ్య గుళిక 

అంగాంగం మెలిపెట్టడం కాదు 
అన్నింటిని ఐక్యం చేయడమే .... 
గురు సమక్షంలోనే గురి కుదురి 
జీవితాన్ని ఆవిష్కరించుకునే యోగం ...  

అంతర్జాతీయ యోగా దినం ... 
అందరు బాగుండాలనే వరం ... 
ఆరోగ్యాల గుళికల ఆనందం 
మహాభాగ్యాల భాండాగారం....  

ఆధ్యాత్మికత తరంగం  
పతంజలిచే అనుసరణీయం 
మోక్షసాధనకు ఉపాంగాలు 
అంతః దృష్టి పరమానంద ప్రాప్తికి 
మార్గములై వెలుగు చుండె ... 

వేద పురాణ ఇతిహాసములలో 
విశదీకరించిన ముఖ్య వివరాలనే 
ముదముగ విపులీకరించి విశదంగా 
సూత్రీకరించె పతంజలి... 

ఇంద్రియ వశంతో ఈశ్వరుని 
యందు లయము చేయడమే .... 
సమాధి పద, సాధన పద, 
విభూతి పద, కైవల్య పదగా 
మానసిక శుద్ధికి వరములుగా  ... 

ఆరోగ్యానికి అష్టాంగయోగం .... 
ఆసనములు , ప్రాణాయామములు  
పద్ధతులను, బంధములను, 
ముద్ద్రలను, క్రియలు సవిస్తారములే ... 

వేల ఆసనాలలో వెలకట్టలేనివంటూ 
రత్న మాణిక్యాలుగా ఎనుబది నాలుగు 
ఎంపిక ... శరీర అంతర్ బహిర్ శుచికి 
అవసరానుగుణంగా అన్వయించిరి .... 

మతాలకతీతం మాహా ఆరోగ్యసూత్రం 
దేహమే దేవాలయమని దేశదేశాలలో 
ప్రాచుర్యం ...వ్యాయామ క్రమబద్దీకరణే 
ఆసనాలుగా అద్వితీయమై వ్యవహారం...  
మరమ్మతుల మర్మమెరుగని నివారణ…

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment