ఉచిత సలహా
తేది : 29-05-2024
శీర్షిక : విచక్షణ వివేకం
సబ్ కా సున్ నా
అప్ నా కర్ నా ....
అడగకుండా ఇచ్చేవి
అమూల్యమైనవి కావొచ్చు
అడిగితే ఇచ్చేవి
అసామాన్యమైనవి కావొచ్చు ....
ఉచిత అనే పదం ...
ఇరువైపుల కత్తిలాంటిది
ఉన్నతమైనది కావొచ్చు ..
ఉత్తుత్తి మాటలు కావొచ్చు ...
అనుభవ శూన్యాలతో
ఆకతాయితనాలతో
ఊకదంపుడు మాటలు
ఊసుపోక ముచ్చట్లలా
జతచేసి సందర్భానికి
జోడిస్తూ ఇచ్చే
సలహాలు ఇంకొందరివి....
సంశయానికి సరిపోయేవి
సందర్భానికి అనుకూలం
ఉచిత న్యాయ సలహాలు
ఉచిత వైద్య సలహాలు ...
మరికొందరివి ... .
కడుపు నింపేవి కావాలి
కాలు నొప్పి తగ్గేవి కావలి ...
కష్టాలను గట్టెక్కించేవి కావాలి
కడగండ్లను దాటించేవి కావాలి ...
జీవరాశిలో మానవాళి
మిన్నంటూ చెప్పడమే కాదు
చేతలతో చేసి చూపితేనే
అసలైన నిర్వచనం ....
ఇచ్చేవారైనా .. తీసుకునేవారైనా
ఉచితానుచితాలు గుర్తెరగడమే
విచక్షణ వివేకం ....
రాజకీయ ఉచితాలన్నీ
నీకిది ... నాకది లా చెడును
ప్రోత్సహించేవే ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment