అటు డాలరు ... ఇటు రూపాయి
తేది 21-05-2024
శీర్షిక : భవితను శాసించడం ఖాయం ...కాచుకోండిక..
పరోక్ష ఉగ్రవాదానికి ప్రాణప్రతిష్ట చేసే
భ్రమల దేశం... ఏం మాయ
చేసిందో ... ఏం మంత్రమేసిందో...
పేరు పోయిన ఎంకమ్మ పేనం
ఎత్తుకు పోయిందన్నట్టుగా ....
జగమెరిగిన జంగమయ్యాలా
డాబు దర్పం బాగానే వెలగబెట్టింది..
విర్ర వీగుతున్నది...పోరి పొరుగుల
యువతను అమ్మా బాబులనుండి
వదిలి పోయేట్టు కూడా చేసింది ....
విశ్వవీథిలో తిష్టవేసిన పాలపుంతలోని
సూర్యుని చుట్టూ గ్రహాల మాదిరిగా
పనికట్టుకుని తన చుట్టూ ప్రపంచాన్ని
తిప్పుకుని మురిసిపోతుంది ....
దీటైన విపక్షం లేనంత వరకే...
ఎవరైనా…. దిమ్మదిరిగే బొమ్మ చూపిస్తే
ఎంతవారుగాని వేదాంతులైనగాని
వాలు చూపుతో సోలిపోదురోయి...అన్నట్టు...
చక్కని ప్రణాళికతో అడుగులేస్తూ
అనుభవాలను ప్రోది చేసుకుంటూ
అవకాశాలను అందిపుచ్చుకుని
ఆకాశ వీధుల్లో పయనం మొదలైంది
రూపాయిది ....
అనుకున్నట్టు మరోవిడత పాలనా
పగ్గాలు చేతికందగానే..భారత త్రిమూర్తులు
భవితను శాసించే బలాన్ని పుంజుకోని
రూపాయిని విశ్వ విజేత చేయడం ఖాయం ....
కాచుకోండిక….
నగునూరి రాజన్న
No comments:
Post a Comment