మాతృ గేయాలు -2024
తేది : 11-05-2024
శీర్షిక : అమ్మ నోట ...
అమ్మ నోట మాటలు
ఆణిముత్యపు పాటలు ....
కమ్మనైన మాధుర్యం
తన్మయాల జీవనం ....
అమ్మకొక్కటే దినమని
అనుకోకు భావము…
అనుదినము అమ్మను
తలచడమే భావ్యము ....
ముక్కు చీదు మురిపముగా
తల్లి ఉదరం తమ పాలిట
గర్భగుడని తలిచినోడే ధన్యుడు …
అమ్మ రుధిరం అణువణువు
నిండినదని తెలిసినోడే పుణ్యాత్ముడు…
అమ్మ నోట మాటలు
ఆణిముత్యపు పాటలు ....
అవనిమాతా ఓర్పులా
అమ్మకూడా అదే విధం ....
వెలలేని సేవలకు
ఇల మూలం అభిమతం ....
స్వార్థమెరుగని సరంగు
శోషణెరుగని పోషణలు ...
అణువణువు నిండిన
శోధనెరుగని సేవలు...
అమ్మ నోట మాటలు
ఆణిముత్యపు పాటలు .... ...
రజనీకర కౌముదిలా
కరగదీసి పంచడమే ...
పిండివెన్నెల చందంగా
నిండుదనం ఆత్మీయత ....
అమ్మ విలువ తెలియాలంటే
అమ్మై పోవడమే ఖాయం ....
అమ్మకు లేనేలేదు జగతిన
అసలు ప్రత్యామ్నాయం…
అమ్మ నోట మాటలు
ఆణిముత్యపు పాటలు ....
సొల్లు తుడుచు తల్లిగా ....
పక్క నువ్వు తడిపినా
లెక్క చేయదు మక్కువతో ...
బాల సపరిచర్యలలో
భానునిలా
అలుపెరగదు
....
ఒకటికైన రెంటికైన
కుడిఎడమల తేడ లేదు…
అమ్మ నోట మాటలు
ఆణిముత్యపు పాటలు ....
ముద్ద ముద్ద పేరుజెబుతూ
ముద్ద నోటికందించును ....
సద్దిముల్లె సుద్దులెన్నో
కోకొల్లలు బోధించును ....
పక్షపాతమంటే తెలియని
శిక్షణెరుగని ఆయమ్మ ...
చిన్ని దెబ్బకు అమ్మా యన్న
తల్లడిల్లు గుండె గుడి ...
అమ్మ నోట మాటలు
ఆణిముత్యపు పాటలు ....
కమ్మనైన మాధుర్యం
తన్మయాల జీవనం ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment