తీరిన సంతృప్తి…
10-06-24
తిరిగి చూసుకుంటే తీరిన సంతృప్తి
తింగరితనములే కాకుండా
బంగారు క్షణాలేమయినా
ఉన్నాయా తవ్వుకోండి ....
అర్హతల కుప్పలో అమరక
అమ్మ ఆస్పత్రినుండి తిరుగు
పయనమునకు కారు చార్జీలు
ఇవ్వరని తెలిసి ... వైద్యుల
సిఫారసుకై వచ్చినప్పుడు ....
నా ముక్కు మోహం తెలియకపోయినా
కుటుంబ సభ్యులకు నా పేరు చెప్పి
హామీ దొరుకుతుందన్న భరోసా
నింపిన బ్యాంకు ఉద్యోగి బహుగొప్ప
సందర్భం ...
పిల్లల పుట్టుక ధ్రువీకరణ
పత్రములకై పట్టుబట్టి
ఫలితాలను తెప్పించిన
పలు సందర్భాలు ...
సమయానుకూలమైన
సందర్భాలలో బిల్లులు
ఒక్క పూట ముందుగా
ఇప్పించి మెప్పించిన
లెక్కలేనన్ని సంఘటనలు ....
తనవారి కోసమే కాకుండా…వాసవి
మాత సేవలో శాయశక్తుల తండ్లాడి
తరించిన ఆనవాళ్ళే…దశాబ్ధమున్నర
పాటు దండిగాను….
పరిసర పరిశ్రమల ఉద్యోగుల
పిల్లలకు... బంధు మిత్రుల
పిల్లలకు... ప్రాజెక్టు పనులకై
పలకరించిన వందల మందికి
చేదోడు వాదోడు ....
పదవీ విరమణల తదుపరి కూడా
పదికాలాలు పాటు మనం కనిపిస్తే
మనఃపూర్వకంగా నమస్కరించే
చేతులకు విలువ తెలుసు ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment