Friday, July 26, 2024

మీ పాట మీ నోట తేది : 28-05-2024 శీర్షిక : పల్లవించవా పాటగా

 కవన రవళి -

అంశం : మీ పాట  మీ నోట 
తేది : 28-05-2024
శీర్షిక : పల్లవించవా పాటగా 

పల్లవించవా పాటగా 
నా మదిలోని భావాలను  .... 
చరణములై శోభిల్లగా 
ఉర్విలోన గానములై  .... 

వసంతమే  వచ్చెనని 
ముదముగ  మురిసిపోనా....  
కోయిలమ్మ పాటలతో 
కొసిరి కొసిరి ఆనందించనా .... 

పల్లవించవా పాటగా 
నా మదిలోని భావాలను  ...

చిగురాకుల  చివుళ్ళతో 
వనమంతా ఊసులాడ 
ఘనమైన సందేశము 
మనమున ఊర్రూతమై .... 

పల్లవించవా పాటగా 
నా మదిలోని భావాలను  ...

చిలిపి ఊహలేవేవో 
చిందేసి ఆడుతుంటే .... 
పసందైన పాటలతో 
మనోల్లాసం పొందడమే .... 

పల్లవించవా పాటగా 
నా మదిలోని భావాలను  ...
చరణములై శోభిల్లగా 
ఉర్విలోన గానములై  ....


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment