తిరోగమనం
తేది : 26-05-2024
శీర్షిక : దిగజారుడే అన్నింటా ....
రాతి గుహల జీవితం
రంగుల భవనంలోకి
మారిందని సంతోషించాం ...
ప్రకృతిని పీడిస్తున్నామని
మరిచిపోతున్నాం ...
నాగరికత నాలుగడుగులు
వేసి ... పారిశ్రామికతలో
పరుగు లంఘించిందని
చంకలు గుద్దుకునే లోపల ...
విషతుల్యాల కాలుష్యం
మాటలు పెడచెవిన పెడుతున్నాం ....
సాంకేతికత పతాకం ఎగుర
వేసిందనేలోపల ... స్వార్థాలు
రాజ్యమేలి ... బంధాలలో
పగుళ్లు ఏర్పడి బీటలు వారిందని
గుర్తించడం మరిచాం ...
రాచరికం రూపుమాసిపోయి
ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందని
ఆనందం వెల్లివిరిసే లోపు...
ఓటుకు నోటొచ్చి ... ఉచిత
సంక్షేమాల పేరుతో ... నాయకుల
స్విస్ బ్యాంకుల ఖాతాలు నిండుతూ ...
ఉత్పాదకతకు ఉదకం విడుస్తూ
దేశ గతిని తిరోగమనానికి మార్చే
పనిలో శ్రద్ధ చూపే దిగజారుడు
రాజకీయ నాయకులతో
నా దేశమిప్పుడు కలకలలాడుతోంది ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment