సాయి నామం సర్వ మోదం - సాయి ధామం పాపహరణం
ద్వారకామాయి పుణ్యస్థలిగా -దర్శనమిచ్చి దరిచేర్చావు
ఫకీరుగా పిలిపించుకుని - పామరులను సృశించావు
బడబాగ్నులను హరియించి- మనోవేదనలను తీర్చావు
పాముకాటు,చెవి పోటు- అంతు చిక్కని అనారోగ్యాలను సైతం
వాక్కు దృ ఢత్వంతో శాసించి - వ్యాధులన్ని నయం చేసావు
కపటం లేని కర్మలాచరించే -ఆధ్యాత్మికతను అందుకోమని
నిలువెత్తు నిదర్శనాలు చూపి -కనువిప్పులు కలిగించావు
స్వార్థం వీడమని సంకేతించి - సంస్కరించి సద్గురువయ్యావు
సర్వాంతర్యామిగా సంచరించి-సంపదలతో సాదరించావు
సర్వస్య శరణాగతి శ్రేష్టమని - దాసోహమే సర్వోత్క్రుష్టమని
సంశయాలను పారద్రోలి - సంకల్పముతో నిలిపావు
సాధ్యమైనంతలో కాదు లేదు అనకుండా-సాటి వారిని ఆదుకొమ్మని
సహేతుకమైన సాక్ష్యాలిచ్చి - సర్వామోదం పొందావు
బాధలన్ని సంక్షయం చేసి - భక్తుల కొరకే బ్రతికావు
భక్తి ఓపికలు సడలకుండా - నడవడిని నియంత్రించు బాబా
సాయి స్మరణ పునశ్చరనే- సదా సద్గతికి మార్గమని
అంతర్ముఖులను గావించి- ముక్తి మార్గం చూపావు