Friday, July 26, 2024

చట్టం తేది : 12-06-2024 శీర్షిక : ఎవరికీ చుట్టం కాకూడదు

 చట్టం 

తేది : 12-06-2024
శీర్షిక : ఎవరికీ చుట్టం కాకూడదు. 

అనుభవాల పరిమళాలను 
అద్దుకుని నియమ నిబంధనల 
చట్రం బిగించుకోవడం ... 
వ్యక్తుల సంరక్షణ సమాజ సంక్షేమం 
రెండు కళ్ళుగా చేసుకుని కదిలే కొరడా .... 

ప్రాంతాలను బట్టి అలవాట్లను 
బట్టి మార్పులు చేర్పులు చేసుకుని 
కలుపుకుని సాగె మనుగడలకు 
కలహంస లాంటి దిక్సూచి ... 

ఉన్నత భావాల ఉనికితో 
అంకిత తత్వాల అమలుతో 
ప్రజలంతా సమానమనే సంకేతం ... 
పాలకులకు పగ్గాలుగా దేదీప్యం .... 

రాను రాను స్వార్థాల ముసుగులో 
రాజులైనా పాలకులైనా రవ్వంతతో 
మొదలుపెట్టి రంద్రాన్వేషణలు గావిస్తూ 
అసలుకు ఎసరు పెడుతున్న మోసాలే... 

ఉన్నవారికి ఆట బొమ్మలా 
లేనివారికి తోట మాలిలా 
కాకుండా అందరికి సమానమైతేనే 
ఎక్కువ కాలం ఆదరణలతో మన్నిక .... 

చట్టం ఎవరికీ చుట్టంలా కాకుండా 
న్యాయం ధర్మం సమానమైతే ...,
సర్వసమ్మతమే సద్భావనలే  
సమున్నతమే సత్కీర్తులే ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment