చిత్ర కవిత
తేది 16-06-24
శీర్షిక : నగుబాటు నడవడిక
నాగరికత నడినెత్తిన
తైతక్కలాడుతుంటే ... మరోపక్క
అచ్చమైన మాతృత్వం
ఆరాట పడుతున్నది ....
కాలి మాయానో కలికి మాయానో
చదువు శారెడు బలపాలు దోశెడులా ...
సదువుకున్నమ్మ సద్ది ముల్లెలా
సంకలో కుక్కపిల్ల నేసుకుని
పక్కన కన్నబిడ్డను నడిపించ ....
చదువుకోని మహాలక్ష్మమ్మ
జోలిలో బిడ్డను వేసుకుని
కడుపుకింత గంజి సాధించాలని
నెత్తిన బరువెత్తుకుంటున్నది ....
వింతపోకడలతో కొంత
ద్యోతకమౌతున్నది ....మార్పు
అలవాట్లు ఎప్పుడూ మంచిని కోరాలి ...
పగలబడి నవ్వుకునే పతనాన్ని కోరితే
మంచి ఎలా అవుతుంది ....
ఏదేమైనా మన నడవడిక
మందికి నగుబాటు కాకుండా
మనం చూసుకోగలగడమే
నాగరికతకు మైలురాయి ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment