విధాత తలపున
తేది 06-06-2024
శీర్షిక : వింతలు నిండిన విశ్వం ....
సహస్రాధికం
విధాత తలపున విరిసినది
వింతలు గొలిపే విశ్వరహస్యం ....
విరించి లిఖితం సమస్తం
విశ్వ కోటిలో నిండిన అనంతం ....
ముద్దమందారమే ముదము గొలుపు
మురిపము నిండిన పాలపుంతలు ...
చూడ ముచ్చటే సుందరమైన
సూర్య చంద్రుల నక్షత్రమండలం ....
పాలపుంతల పరిభ్రమణంలో
గ్రహకూటమిల పతంగి తోరణం....
కలిసిపోతున్న భ్రమల సౌరకుటుంబం
కలవని స్వీయ నియంత్రణల చిత్రమే ...
ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విజ్ఞాన
భాండాగారం ....విడివడని వింతలే ...
తరలకైనా తరగని బుద్ది కుశలతలే
భూరి సంపదల భువన మోహనం ...
పంచభూతాలతో పవిత్రమే
జీవకోటితో నిండిన సుందరం ...
లెక్కలేనన్ని కొత్త విషయాలతో
లెక్కతేలని విశ్వసౌందర్యం ....
ఒక్క సమస్యను విసిరిందంటే
ఒడువని ముచ్చటే ... జీవితమంతా
వీడిపోని చిక్కుముడే ... వింతలతో
కథలు అల్లుకుని విని తీరాల్సిందే ....
లక్షల కోట్ల మనుషుల్లో ....
లక్షణాలు కలవని ముద్రలే ....
రంగులు రూపులు ఆకారాలు
వింత గొలుపదా వినడానికి ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment