నెమలి
తేది: 11-06-2024
శీర్షిక : హరివిల్లు బోలె ...
హరివిల్లులోని రంగులతో
అందాలన్నీ నింపుకున్న
కోలుకుల కొలికి.. అతివలకే
నడకలు నేర్పిన వయ్యారి ....
అంబరాన నిండుకున్న మేఘాలకు
అవనిపైన పులకరించి అడుగులతో
చిందేసే గురువెరుగని నాట్యగత్తె
ప్రకృతికే పాఠాలు నేర్పగలికే
కులుకుల రాణి ... చిన్నా పెద్దలకు
చిలకరించు ఆనందాలు ...
ఎంతెంత అదృష్టమో కదా ...
ఆ కన్నయ్యకు అమితానందందం
నెత్తిన నెమలీక ధరించగా ... ఉనికిని
ఉద్దరించుకున్న శుభ సందర్భం ...
రారాజులను కూడా పలకరించే
పద సింహాసనములలో పదిలమై ...
దేశీయ పక్షిగా నిలిచే చూడు
దేదీప్యమానమై భరతమందు ....
రమణీయత గొలుపు రంగు రంగుల్లో
రమణుల వస్త్రములందు ...
ఆభరణములయందు.. ఒదిగే
రమ్యమైన మనోహరముగా ....
వేరు పక్షులతో జోరు లేకున్నా ...
తమలో తామే కలిసి గుంపులుగా
బతికినా ... ఆధ్యాత్మికతలలో కూడా
ఆలంబనమే వాహనమై వరుసన
సుబ్రమణ్యునకు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment