ఏకాంతానికి అటూ...ఇటూ...
తేది : 10-07-2024
శీర్షిక : సుందర దృశ్యం
సహస్రాధికం ....
కోరుకుంటే వచ్చేది ఏకాంతం
కొరత తీరు ఎన్నో సమస్యలు...
కోరకుండా వచ్చేదైతే
కొరివిలాంటి ఒంటరితనం ....
అటూ ...ఇటూ...ల ఊగిసలాటలలో
అర్థాలే మారిపోవు ....
అప్పు తచ్చుల్లా ఒదిగిపోయి
అనర్థాలకు మూలమగును .....
మనకు మానమై ప్రశ్నించుకునే
మంచి మార్గం ఏకాంతం ...
విమర్శించుకుని విశ్లేషించుకుని .
శాంతిని ... ప్రశాంతతను ...పట్టుకుని
పరమానందం పొందే ఉన్నత మార్గం .....
మూర్ఖత్వములో ముచ్చటగా
తోడుండే తోరపు బంధం ఒంటరితనం ....
దుఃఖంలోనో దూరదృష్టి లేకనో
మనాది లోనో మదిలో జరిగే గందరగోళం ....
సూక్ష్మంలో మోక్షంలా
అంతరాలను గ్రహిస్తూనే
అనుగ్రహాలకు ఆరాటపడటమే ....
విజ్ఞుల విశిష్టుల ప్రవర్తన...
వింతనిపించినా మనం విడదీసి
చూడాల్సిన సుందర దృశ్యం ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment