ఆత్మీయతా లతలు
తేది ; 28-05-2024
శీర్షిక : కలిసొచ్చిన సమయమిదే ....
అమ్మనుండి మొదలైన మొక్క
ఆత్మీయతా లతలు పెనవేసుకుని
తోబుట్టువుల అనురాగాల తోటలో
పదిలమై పరిఢవిల్లినది ....
అవిభాజ్యాలలో అంకురమైనా
పల్లెలలో నాడు పచ్చగా విచ్చుకున్నది ....
శతాబ్దాల తరబడి శతమానం
భవతీ అనే నినాదముతో ....
పరుగు లంఘించుకున్న
పారిశ్రామికీకరణలతో పలుచబడి
పట్టణీకరణలతో పుట్టగతులు
లేకుండా చిరునామా వదిలేసింది ...
పాలకుల పట్టింపులేనితనంతో
పాశ్చాత్యాల వైపు దీనంగా చూసి
డాలర్ల మోజులో దండిగా మునిగి
సంపదల సంకెళ్ళలో బందీ అయింది ....
మించిన దొరకని తరుణం
కలిసొచ్చిన సమయమిదే
దగా అవుతున్న ఆత్మీయతలను
దారితప్పిన అనురాగాలను ...
ఒడిసి పెట్టుకుందాం ...
కలిమిలేములు కావడికుండలని
తెలుపుతూ ... సంప్రదాయాల
విలువలు వల్లించి ...సద్గుణాలను
బోధించి దారితప్పిన సోదరులను
కలుపుకుందాం ....ఆత్మీయతా లతలు
చివుల్లేసే విధంగా అనుసరిద్దాం ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment