కవన రవళి
హైకూలు
( జాబిలి - వెన్నెల )
--
తేది 11-07-2024
పండు వెన్నెల
చెలి చెంతనుండగా
యుగమే క్షణం ...
పున్నం వెలుగు
పూదోటలో కురిసె ...
కౌముది జల్లు
నిండు చంద్రుడు
నీలి గగనాలలో
తేలి పోతుంది ....
వెన్నెల రాజు
కలువలు పూసాయి ...
అనురాగము ..
పిండి వెన్నెల
ఆరబోసే మహిలో
వింత కానుకై ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment