ఆత్మీయ స్పర్శ
తేది : 25-06-2024
శీర్షిక : ఆత్మ బంధం ...
మాతృగర్భపు పొత్తిళ్ళలో
మొదలైన అమ్మ స్పర్శ
అజరామరము ఆత్మీయమే
సాటిలేనిది పోటీ లేనిది ....
ఫలితమాశించని ప్రకృతి
పరితపించు ప్రతిక్షణం ....
బరువని ఎంచని తరువు
బ్రతుకంతా బాధ నివారణే ...
అనారోగ్యాల భాధలలో
ఆపన్నమై అందించే
అనితరమే ఆత్మీయ హాస్తం
ధవళవస్త్రదారుల స్పర్శ ....
బంధం కానీ బంధం
ఆత్మీయ సంబంధమై
ప్రత్యక్ష పరోక్షాలలో
పరితపించి ఆరాటపడే
కృష్ణ కుచేలులలాంటి
మిత్రుల స్పర్శ ....
హరిలీలన అంకురించు
జన్మబంధం ...ఏరికోరి
ఎత్తుకునేది మిత్రబంధం ...
ఏదో తెలియని పాష బంధమే
ఎదురొచ్చి నిలిచే ఆత్మ బంధం ...
ఆత్మీయ స్పర్శ ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment