గర్వం
తేది : 13-06-2024
శీర్షిక : చేతులడ్డం పెట్టాలి ....
నేను మాత్రమే అనుకోవడం ....
అంతా నాకే తెలుసనుకోవడం ....
నేను చెప్పింది వేదమని వాదించడం ...
ఒక విధంగా మనిషిని చెడగొడుతుంది ...
అహం తోబుట్టువైతే మాట
విననీయదు ... తలకెక్కితే
ఆలోచించనీయదు ... కలుపు
మొక్కలా ఏపుగా పెరుగుతుంది ....
విశ్వంలో చుక్కంత బతుకు
అయినా పాలపుంతనంటారు ...
సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు
అంతా మా చుట్టాలీనంటారు ..
నెత్తిమీద తైతక్కలాడితే .
స్వీయనాశనానికి దిక్సూచి ...
చిక్కుముడుల ఆహ్వానం
చింతల మూటల వంత పాట ...
నేను కూడా అనుకుంటే సబబే
అనుకువతో సాధించి
అనిర్వచనీయమైన గర్వం
అనుభవిస్తే అంతకంటే ఇంకేం కావాలి ...
No comments:
Post a Comment