స్వేచ్చా గీతాలు
తేది: 12-08-2023
శీర్షిక : నలుగురిలో ఒకరిలా
మిగిలిపోకు నేస్తమా ...
నలుగురిలో ఒకరిలా
మిగిలిపోకు నేస్తమా ...
తొలకరి పలకరించగనే
మరకతమై శోభించే
అవనిమాత ఓర్పులతో
అడుగులేయి మిత్రమా
ప్రతినిత్యం పరులకై
ప్రాకులాడు ప్రకృతిలా
పచ్చదనం పొదువుకుని
పరితపించు సాక్షిగా ....
// నలుగురిలో //
సంద్రపు జలములలా
లవణము మూటకట్టకు
స్వచ్ఛ ఓషధీ సెలయేటిలా
ప్రాణములను నిలుపుమా…
వంటకు తంటాలు బాపి
అవసరాన ఆదుకుని
నాగరికత నేర్పించిన
నిప్పురవ్వలా జ్వలించుమా ....
// నలుగురిలో //
సంద్రపునీటిని సైతం
సరళంగా సంగ్రహించి
వెండిమబ్బు జారవిడిచు
నిండుకుండగ మారిపో…
ఉచ్చ్వాసల నిచ్చ్వాసల
ఉనికి భౌతికమైనట్టుగ
ప్రాణవాయువులిచ్చేటి
పవన వీవెనై ఫరిడవిల్లు…
// నలుగురిలో //నిశిని తరిమి కసి వెలుగుల
కాంతులీనే సూర్యునిలా
పత్రహరితం పంచిపెడ్తూ
పరితపించు పరులకై ....
నిశీధిలో నిర్మలమై
ప్రకాశించే కౌముదిలా
ప్రసన్నతలు పంచుతూ
పద ముందుకు జాబిలివై ....
// నలుగురిలో //
ఇడుగు ఇరువాలుతో
పసుపు కుంకుమలయ్యే
పోడు భూమి కమతపు
బీడు దున్నే రైతన్నగ మారిపో…
శత్రువుల గుండెలలో
శతఘ్నులను పేల్చేసి
ప్రాణాలనే ఫణముపెట్టే
దేశ ప్రేమి జవానువైపో …
// నలుగురిలో //
నగునూరి రాజన్న
No comments:
Post a Comment