Saturday, July 27, 2024

జీవన మూలాలు తేది :04-07-2024 శీర్షిక : బంధాలు పెరగాలి సహస్రాధికం

 జీవన మూలాలు 

తేది :04-07-2024
శీర్షిక :  బంధాలు పెరగాలి 
సహస్రాధికం 

జీవరాశికంతటికి మిన్నైన 
మానవాళి ఒకప్పుడు .... 
అదఃపాతాళానికి అతుక్కు 
పోతున్నాడు ఈనాడు .... 

ఆత్మీయతలు అడుగంటి 
అనురాగాలు ఎగిరిపోయి 
అనుబంధాలు మచ్చుకైనా 
కానరాక అలితేరుతున్నారు .... 

మానవ సంబంధాలను 
ఆర్థికసంబంధాలుగా మలిచి 
పచ్చగున్నంతవరకే నీతో పని 
పలుచబడితే నీవెవరో నేనెవరో..... 

సంస్కృతిని చావిట్లోనే వదిలి 
సంప్రదాయాలను సందుగలో 
దాచి ... ఆచారాలను అటకెక్కించి 
యాంత్రికతను మూటగట్టుకున్నాడు .... 

లెక్కల్లో మునిగి తేలుతూ 
మీ ఇంటికొస్తే ఏమిస్తావు 
మా ఇంటికొస్తే ఏమి తెస్తావనే 
పోకడలతో చిన్నబోతున్నది... 

విజ్ఞానం పెరిగేకొలదీ 
వివేకాలతో ఆలోచిస్తూ 
విచక్షణల విలక్షణాలతో 
వింతగా బంధాలు పెరగాలి .... 
ఎంతైనా మనమంతా కృషి చేయాలి.... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment