లలిత గేయాలు
28-10-23
శీర్షిక : ఉషోదయం.
ఉషోదయపు చిత్రము
ఉల్లమంతా ఉత్సాహం
కుక్కుటముల కూతలతో
మెలకువకు రాగములు…
పసందైన విందులే
పరిసరాల ప్రశాంతతలు…
బుడి బుడి వెలుగులకు
ఆహ్వానములంపగనే …
మత్తు వదిలి గమ్మత్తే
నిశి ఛాయల వీడ్కోలు…
ఉషోదయపు చిత్రము
ఉల్లమంతా ఉత్సాహం
బాలభాను కిరణంతో
రసమయమే అంబరం…
రంగులు వెదజల్లుకుని
నింగిశోభ నింపుకొనగ ...
శుకపికముల కువకువలు
శూన్య ఛేదన రవములు ...
మనోమయపు సంగీతం
మానసముల ఆహ్లాదం ...
ఉషోదయపు చిత్రము
ఉల్లమంతా ఉత్సాహం
తలలూపే తరువమ్మలు
చిరుగాలికి ఈల వేస్తూ
కొసిరి కొసిరి మురెసెనా
కుసుమ పరిమళాలను…
రవికిరణం సోకగనే
మురియునులే కుసుమం..
సువాసనలు వెదజల్లగ
సుందరమే వాలిన భ్రమరం…
ఉషోదయపు చిత్రము
ఉల్లమంతా ఉత్సాహం …
నగునూరి రాజన్న
No comments:
Post a Comment