Friday, July 26, 2024

బాల రాముని చరితం శ్రీరామామృతం… తేది : 24-01-2024 శీర్షిక : బాల రాముడు ...

 బాల రాముని చరితం శ్రీరామామృతం…

తేది : 24-01-2024 
శీర్షిక : బాల రాముడు ... 

 బుడి బుడి అడుగుల బాలరాముడు 
 భువికి చేరెను ... అదిగో చూడుడు ....
అడుగడుగున జడివానను మరిపించే
జనహారతులు …ఇపుడే కనుడు…. 

సరయూ నది తీరమున
సౌమిత్రికి ప్రియములతో ....
కోసల దేశాధిపతి నీకు 
కోటి కోటి ప్రణామములు .....

వందలేండ్ల నిరీక్షణలకు
వర తపో సంపత్తిగా ....
బాసురమై వెలుగొందేనే 
వాసిగా అయోధ్యపురములోనా .... 

బుడి బుడి అడుగుల బాలరాముడు 
భువికి చేరెను ...అదిగో చూడుడు ....

చిరునగవుల దరహాసం
చిన్ముద్రల దక్షిణ హస్తం…
విల్లంబులు చేకొనిన 
వామహస్త భంగిమలతో .... 

కారు చీకటి కాంతి పుంజం 
కనులలోనఁ మెరుపులు....
కాంతులీను బుగ్గలపై 
కరుణ సుధలే అధరములలో ....

 బుడి బుడి అడుగుల బాలరాముడు 
 భువికి చేరెను ... అదిగో చూడుడు .... 

అందమైన ఆ రూపము 
ఆనందములే మదిమదిన … 
భవ్యమైన గుణశీలతలు 
యుగములైన కొలమానములే…

ఆదర్శము అది చూడగ
ఆత్మీయతల నిర్వచనం.... 
అనురాగం నీ వెంటే 
అన్నదమ్ములనుబంధం .... 

 బుడి బుడి అడుగుల బాలరాముడు 
 భువికి చేరెను ... అదిగో చూడుడు .... 

బంగారు కోవెలలో 
బాల రామ ప్రతిష్టితము .... 
ఊరు వాడ ఒక్కటాయె 
రామనామ జపములాయే…

మననమే పుణ్యమని 
మనసంతా నమ్మినాము. 
ఘనమైన అదృష్టమే 
వీక్షించగ ప్రాణ ప్రతిష్ట.... 

 బుడి బుడి అడుగుల బాలరాముడు 
 భువికి చేరెను ... అదిగో చూడుడు ....

నగునూరి  రాజన్న 

No comments:

Post a Comment