కార్గిల్ కష్టాలు
తేది : 23-11-2022
శీర్షిక : "విజయ్" గీతికా
సురు నదీ తీరంలో వెలిసిన
సుందరమైన పట్టణం ...
రెండువేల ఏడు వందల మీటర్ల
ఎత్తులో విచ్చుకున్న పచ్చికలు
స్వీయ చిక్కులతో ఊపిరాడకున్నా ...
చికాకులతో ఊపిరి బిగపట్టుకునైనా...
పరాభవాల పాఠాలను పక్కన బెట్టి కూడా ...
పక్కలో బల్లెంలా పదే పదే కాలు
దువ్వుతుంటారు... దాయాదులు ...
నాది కానిది కోట్లయినా వద్దు
నాదన్నది రాయి రప్పయినా ముద్దు
కొండా కోనా...ఎండు పుల్లైనా మెండే
నా మాతృ దేశం నాకు గొప్పనే తత్వం
మనది ....
సుందర కాశ్మీరములో కలికి తురాయి
అందమైన భారతావనికి శిఖర సమం
అందులోనా హొయలుపోయే లోయలెన్నో
రక్షణలకు తోడయ్యే రమ్యమైన శిఖరాలెన్నో ....
దాయాదుల పన్నాగం దమన నీతి దురాగతం
నమ్మకంగ నడుచుకుంటూనే నట్టేట ముంచే రకం
పొంచి చూచిరి అదను కోసం వంచన తత్వంతో
పోరాటం మెదలుపెట్టి పొందిరి ఆత్మానందం…
చావు దెబ్బ రుచి చూసి కన్ను లొట్ట పోయి
కాలికి బుద్ది చెప్పి వెన్ను చూపి పారిపోయిరి….
ఇరువది మూడు సంవత్సరాల క్రితం..
ఎనబది నాలుగు రోజుల నాటకానికి తెర
విజయ్ ఆపరేషన్ పేర విజయోత్సవం
జరుపుకున్నరోజు…వినీలాకాశంలో వింత మెరుపు
ఆసేతు హిమాచలం ఆనందించిన రోజు…
ఆనాటి అమర వీరులకు అచంచల జోహార్లు



నగునూరి రాజన్న