ఆటలు
తేది : 12-07-2024
శీర్షిక : నైపుణ్యాలు
కడిగిన ముత్యం కావాలంటే
వడపోతల వంతెన దాటాల్సిందే....
స్వేదం చిందించే శారీరక శ్రమలతో
పాటుగా ... మనషికి వికాసం కల్గించు...
దేహం రాటు దేలి రాణించాలంటే
కబడ్డీ , బిల్లం కర్ర , దాగుడు మూతలు ,
కోతి కొమ్మచ్చి , పరుగుపందేలు, తాడాట ,
కుండ టోక్క, త్రో బాల్ , బల్లెం విసరడం
పరుగుబెట్టే ఆటలెన్నో అనుచితమే ...
మేధోమధనం కావాలంటే కూర్చుండే
ఆటలు ... చదరంగం , పులి జీతం ,
అష్ట చెమ్మా , పచ్చిసు , చైనీస్ చక్కర్
లెక్కలేవు బొక్కబోర్లా పడి గెలవడానికి ...
కొన్ని ఇద్దరేసి ఆడగలిగేవైతే ....
మరికొన్ని రెండు జట్లుగా విడిపోయి
ఆడేవి... అన్నివిధాలా అవకాశమే
ఆనుపానులు వెదికి ఆరంభించడానికి ....
పరిస్థితులంతా మారిపోయి ఆట
స్థలాలు మాయమైపోయిన బడిలో
శాపగ్రస్తులౌతున్న ఈ తరం బాల్యంలో
నుండి మనమేమి ఆశించగలం ...
అర్ధరాత్రి వీడియోల ఆటలు ...
పొద్దెక్కేవరకు నిద్రలు ... అలసత్వాల
సమాధానాలు ... అధునాతన మాధ్యమాలలో
ఉరితీయబడుతున్న యువతనుండి
ఏమి ఆశించగలం....
ప్రజలు ... ప్రభుత్వాలు తలో చేయేస్తేనే
పట్టు తప్పుతున్న బాల్యం , యువత
పట్టాలెక్కగలిగేది ... పరాకులు మాని
పాలకులు సాన బెడితేనే సాధ్యమయ్యేది ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment