కలం-గళం - పితృ గేయాలు
తేది : 15-06-2024
శీర్షిక : నా వెన్నెముక
అమ్మెనుక నిన్ను చూసి నాన్న // ప //
నేనర్థమే చేసుకోలె నాన్నా ...
నాన్నా నాన్నా నాన్నా
నువ్వెంత గొప్పవో నాన్నా
తప్పటడుగుల నేనుంటేనో
వడి వడి నడకలు చేయించావు...
గద్గద గొంతుల సందిగ్దములోన
సరిదిద్దిన మాటలు నేర్పించావు....
నీ నీడే నాకు గొడుగయ్యింది
నీ మాటే నాకు గొంతుకయ్యింది
తప్పుల కుప్పను సరిదిద్ది
ఒప్పుల కుప్పగ నిలిపావు ....
అమ్మెనుక నిన్ను చూసి నాన్న // ప //
నేనర్థమే చేసుకోలె నాన్నా ...
కష్టములెన్నో పలకరించినా
ఇష్టముగానే భరియించావు ....
పంటిబిగువున అదుముకోని
పడిన కష్టము తెలువనియ్యలేదు ...
కంటిసైగల క్రమశిక్షణములు
కరుణామృతముల చిరునవ్వు ...
అవసరాలను సదా గుర్తిస్తూనే
అవలీలగా నువు తీర్చినావు ....
అమ్మెనుక నిన్ను చూసి నాన్న // ప //
నేనర్థమే చేసుకోలె నాన్నా ...
రుధిరంలో స్వేదం పిండుకుని
గుండెల పై మమ్ము మోసినావు...
అడగకముందే అన్నీ తెలుసుకుని
అవసరాలను తీర్చేసావు ....
గ్రీష్మములో నేను వాడినప్పుడు
చినుకమ్మగ నువు పలకరించావు .....
శిశిరములా నేనున్నప్పుడు
వసంతమై చిగురించావు ...
అమ్మెనుక నిన్ను చూసి నాన్న // ప //
నేనర్థమే చేసుకోలె నాన్నా ...
చూపుచాటుగా సేవెలెన్నో
సుందరములుగా చేసినావు ...
చీకటివెలుగులు లెక్కచేయక
దారిచూపి గురువయ్యావు ....
నాన్నంటేనే ఓ నమ్మకమని
తొలకరిలా ఎపుడూ భరోసానే ...
నాన్నంటేనే నా వెన్నెముకగ
ఖజానా నిండిన ఖలేజాలే ...
అమ్మెనుక నిన్ను చూసి నాన్న // ప //
నేనర్థమే చేసుకోలె నాన్నా ...
నాన్నా నాన్నా నాన్నా
నువ్వెంత గొప్పవో నాన్నా ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment