జానపద గేయం
తేది : 24-06-2023
శీర్షిక : ఆషాఢం వచ్చింది
సహస్రాధికం ....
ఆషాఢం వచ్చింది మామయ్యో
గ్రీష్మానికి సెలవంది మామయ్యో
ఆవిరైన సంద్రములు
మేఘముల పంపించగ…
తొలకరేమో చిలికింది
అవనిమాతా నవ్వింది ....
హాలికునికి సూచనతో
విత్తనాలు ఎత్తమంది ....
ఇడుగు ఇరువాలుతో
మడులునే దున్నమంది ....
ఆషాఢం వచ్చింది మామయ్యో
గ్రీష్మానికి సెలవంది మామయ్య
పుణ్యకాలం ముగిసింది
ఆయనము మారినది ...
పాలసంద్రం పానుపవగ
యోగనిద్ర
శ్రీహరికి....
ఒడినిండిన అమ్మలా
ఊరూరా చెరువులు
జలచరముల జీవము
రైతన్నకు పండగ ....
ఆషాఢం వచ్చింది మామయ్యో
గ్రీష్మానికి సెలవంది మామయ్య
కొత్తనీటి కలుషితము
కొంత మట్టుబెట్టంగా
గోరింటల రక్షణలతో
కలికి చేయి పండును
ఒకటొకటి శుభములైనా
సంస్కృతేమో దూరమంది ....
కొత్తపెళ్లి జంటలకు
కొంత విరహమంటున్నది ....
ఆషాఢం వచ్చింది మామయ్యో
గ్రీష్మానికి సెలవంది మామయ్య
No comments:
Post a Comment