Saturday, July 27, 2024

ఆనందం--పరమానందం తేది : 12-07-2024 శీర్షిక : ఆత్మ శోధన -

 ఆనందం--పరమానందం 

తేది : 12-07-2024
శీర్షిక : ఆత్మ శోధన - 
సహస్రాధికం .... 

కమ్మని రుచులతో పచికలిగి 
కడుపులు నిండితే ఆనందం ... 
హాయిని గొలిపే మనోల్లాసంతో 
మనసులు నిండితే పరమానందం... 

వెన్నెల తగిలిన చల్లని గాలికి 
ఉల్లం జల్లను ఆనందం .... 
మల్లెల పవనం మనసుకు తగిలితే 
ఉండును కదా పరమానందం ....  

గ్రీష్మంలో భీష్మించిన వేడికి 
చిరుజల్లులు కురిసిన ఆనందం ... 
తొలకరితో పొలి కేకలు వేసే 
మబ్బులు చూస్తే హాలికునికి 
కలుగు పరమానందం .... 

పూదోటలో విహరించే భ్రమరం 
మోతకు... భలే భలే కలుగును ఆనందం .... 
వసంతంలో వనదేవత వరముగా 
కోకిలమ్మ కూజితములకు 
మనమున నర్తన పరమానందం ..... 

ఆధ్యాత్మికమున ఆత్మ శోధన 
ఆనందం ....అందున పొందిన 
వరములాగా ....దేవదేవుడే 
ఎదురై వస్తే పరమానందం ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment