Saturday, July 27, 2024

ఎంత చేసినా ... కూటికే తేది: 25-06-2024 శీర్షిక : సమ ప్రతిఫలం

 ఎంత చేసినా ... కూటికే

తేది: 25-06-2024
శీర్షిక : సమ ప్రతిఫలం 

అమెరికా అధ్యక్షుడికైనా 
ఆరు గాలం కష్టపడే కూలన్నైనా
అన్నము - రొట్టె ఆహారమౌతుందే  కాని 
అన్యము  తీర్చదు  ఆకలి మంటలని ... 

మానవత్వం మంటగలిపి 
పంటలపైన శ్రమలపైనా 
ఏరుకుంటూ ...డబ్బు సంపాదనలే... 
ఈనాటి కలి కాలములో .... 

లక్షలు కోట్లు లగాయించి 
గడించినా ఏమి లాభం ... 
లక్షణముగా తినగలిగేది 
లవణమన్నమే గాని  వేరు కాదు ... 

పేద ధనికుల బేధములేక 
వేదనలు తీర్చునది బుక్కెడన్నమే...  
గాని పెక్కు సంపదలేవియు  
బొక్కలేవు కడుపుకింతగాను.... 

నీతి నియమాలతో అర పూట 
ఆకలి తీర్చుకోగలిగినా ఆనందమే ... 
అన్యాయం చేసి... ప్రతి నిమిషం 
పల్లేరు గాయాలపై కూర్చునే కన్నా .... 

ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే 
అన్నట్టు ... అవినీతెవరు 
చేసినా అది అవినీతే .... 
ప్రజలైనా ప్రభుత్వాలైనా ...  

రైతే రాజంటూ ... నెత్తి 
కెత్తుకోవడమే గాని శ్రమకు 
తగిన సమ ప్రతిఫలమిద్దామని 
ప్రజలకు లేదు ప్రభుత్వాలకు లేదు ... 

మే  డే లు జరుపుకోవడమే ... 
భాషణములే... కానీ ఫలితమేది ... 
పతాకములేగురవేయడమే గాని 
ప్రతిఫలమందనీయరు .... 

యథా రాజా తథా ప్రజా  అన్నట్టు 
మార్పు పైనుండే రావాలి .... 
పాలకులు మారితేనే ప్రజల 
ముఖాలలో చిరునవ్వులు ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment