అమాయకత్వం
తేది : 19-06-2024
శీర్షిక : కాల చక్రం ...
అందరూ బాగుండాలనే
కోరికల అమాయకత్వం ....
ఆత్మీయతల పరిమళాలు
వెదజల్లే అమాయకత్వం ....
అంతా నావారనుకునే
అచ్చమైన అమాయకత్వం ...
నామం పెట్టించుకునే
విధాలు నానా రకాలు....
గొర్రె కసాయినే నమ్మినట్టు
కొన్నుంటాయి ...
గోరంతలను కొండంతలుగా
చెప్పి కోటలు కట్టే రకాలు కొన్ని ..
అజ్ఞానాల తోటలో కొంతమంది
జ్ఞాన పరిమళాలతో మరికొంత మంది
ఏదేమైనా నమ్మకాల పునాదులు
వమ్ము కానన్ని రోజులు ....
నమ్మి నానబోసుకుంటే
పుచ్చి బూరలైనాయి అన్నట్టు ...
నమ్మకాల పునాదులు కూలిపోతే
అమాయకులైనా అది గ్రహిస్తారు ...
నిజం నిప్పుల కుంపటి ...
ఎప్పటికైనా రహస్యాల పొట్లం
విప్పాల్సిందే ....ముందో
వెనకో ... కాలచక్రంలో మనం
కరిగిపోవాల్సిందే ....
ప్రజలంతా అమాయకులైతే
పాలకుల పచ్చిసాటాలు
నడుస్తూనే ఉంటాయి ... అసలు
కాలం తిరగబడుద్దని గ్రహించని
పిచ్చి అమాయకత్వం ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment