ప్రాణ వాయువు
తేది : 05-06-2024
1180 వ రోజు
జీవరాశి ఉనికికి మూలం
ఉచ్వాస నిచ్వాస తోనే ప్రాణం
ఉదారంగా లభించే వాయుకణం
నిబిడీకృతమే వాతావరణం ....
తరువులతో పెరుగు సహస్రం
జీవులకదే ప్రాణాధారం
ఆశల అత్యాశల మనిషి స్వార్థం
సృష్టిస్తున్నాడు నరమేధం ...
చెవిలో ఇల్లు కట్టి పోరినా
మారని మనుషుల్లో నిర్లిప్తం
ప్రమాదపంచున నిలబడినాం
స్వయంకృతమే అవుతుందా సమాప్తం ....
పరివర్తన ప్రతిజ్ఞలెన్నో చేస్తున్నాం
పక్కవాడి పనిలా పరధ్యాన్నం
ఎక్కడిదిగిపోతాడోనని నిష్టూరం
చేయూతల కాదా సస్యశ్యామలం ...
ఓ మనిషి ఇకనైనా మేలుకో
సోయితో ఎవరైనా సోల్తి దీసి మాట్లాడితే
నిట్టూర్పులు కాకుండా నిఖార్సుగా
నిలబడి చేయందించు చేయూతల పర్వం
నగునూరి రాజన్న
No comments:
Post a Comment