Friday, July 26, 2024

మైకు చూస్తే మైకం తేది : 28-05-2024 శీర్షిక : పిట్ట కథలతో నవ్వుల నువ్వులు వెదజల్లాలి ....

 మైకు చూస్తే మైకం 

తేది : 28-05-2024
శీర్షిక : పిట్ట కథలతో నవ్వుల 
నువ్వులు వెదజల్లాలి .... 

వక్తలకు భుక్తమైతే 
వ్యక్తులకు లుప్తమే 
నిజమే కొంతమందికి మైకం 
మరి కొంతమందికి పూనకం 
వెరసి సామాన్యునికి నరకం...  

విషయమేదైనా వింతగా చెప్పి 
మెప్పించే నస గాళ్ళు  ఉంటారు ... 
విషయమెంతున్నా వీసమెత్తు 
పస లేకుండా బాదేసేవారుంటారు ... 

విషయాన్ని సందర్భానికి 
అనుకూలంగా మలుచుకుని 
సమయానికి వినయంగా 
సన్నుతించడమే ఉత్తమోత్తమం .... 

లేదంటే బేజారె ప్రేక్షకులు 
రసాబాసే సమావేశము .... 
మైకే లోకం కాకూడదు 
వక్త అంటే అయిష్టం రాకూడదు .... 

సందర్భానుసారమైన 
పిట్ట కథలతో నవ్వుల 
నువ్వులు వెదజల్లాలి .... 
చప్పట్ల మోత మోగాలి .... 

నగునూరి రాజన్న 
కరినగరము  ( రిచ్మండ్ ) 

No comments:

Post a Comment