విరామమెరుగని జీవితాలు
తేది : 19-06-2024
శీర్షిక : చీమలు ...
విరామమెరుగని జీవితమంటే
వింతగ స్ఫురించు మదిలో
బరువును మించిన బాధ్యతలు
భుజాన వేసుకుని ఉరుకులు
పరుగులు తీసే చీమ పనితనం ...
సంకేతాల సంబరాలు
సద్దిముల్లెల సరంజామాలు
వద్దన్నా బయలుదేరే పయనాలు
బలిష్టమైన ఆవాసాలు ...
వింతగొలిపే జీవన విధానం
విస్తుగొలిపే పచ్చి నిజాలు
వీర జవానుల బోలు పనితనాలు
విధులు వేరయినా గమ్యంమొక్కటే ....
పనులు విభజించుకునే బుద్ధిశాలి
పస్తులనధిగమించే పంట నిలువలు ...
అవసరాలన్నింటిని అతి క్షుణ్ణంగా
అరమరికలు లేకుండా అప్పగించుకునే
ప్రోటోకాల్ ...
పిసరంత పిపీలికమైనా
పిట్ట కొంచం కూత ఘనంలా
పట్టు పట్టిందంటే పుట్ట బంగారం
మెట్టు పెట్టిందంటే తినుబండారం ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment