మన్ మోహనకృష్ణుడా
భామా రుక్మిణి సమేతుడా //2//
మన్ మోహనకృష్ణుడా
మా మొర విన రావా…
త్రిదశలోన స్థిరముగాను
వెలసితివా మహర్దశగా..
యశోదమ్మ మురిపములై
గోపెమ్మల వరమైతివి …
రేపల్లేలోన పాపడివి
మాపాలిట నీవే దేవుడివి..
మన్ మోహనకృష్ణుడా
భామా రుక్మిణి సమేతుడా
కాళింది మడుగులోన
కాళీయ మర్దనము..
గోవులను రక్షించి
గోపాలుడవైతివి ….
రక్కసులను దునుమాడుతూ
ఆశ్రితులను రక్షించావు ...
వేలిపై గోవర్ధనము నిలిపి
ఇంద్రగర్వము గావించావు…
మన్ మోహనకృష్ణుడా
భామా రుక్మిణి సమేతుడా
దశావతారములతో
దర్శనములు చేసితివా
దశదిశల నీ మహిమలు
దండిగాను చూపితివా….
భవద్గీతా బోధకుడిగా
తాత్వికతను బోధించి
హైందవమున ప్రఖ్యాతమై
విశ్వగురువు వైనావు ….
మన్ మోహనకృష్ణుడా
భామా రుక్మిణి సమేతుడా …
No comments:
Post a Comment