Friday, July 26, 2024

ఆనందమే జీవిత మకరందం తేది : 13-06-2024 శీర్షిక : ధనాత్మకమైన సహజ ఆలోచనలు ...

 ఆనందమే జీవిత మకరందం 

తేది : 13-06-2024
శీర్షిక :  ధనాత్మకమైన సహజ ఆలోచనలు ... 
సహస్రాధికం 

వెలకట్టలేనిది కానీ 
వెలుగుపూలు పూయిస్తుంది ... 
అంగట్లో దొరికేది కాదు
అది వెంటయితే అన్నీ ఉన్నట్లే... 
 
సిద్దంగా చిక్కేది కాదు… 
ఏ మారకానికి ఏమార్చలేనిది
ఆకాశమంత ఎత్తుంటుదో లేదో
సముద్రమంత లోతుంటుందో… లేదో 
కాని…కంటికి కనిపించనిది…

పరిమాణంలో  తెలియనిది
పరిచయిస్తే వదలలేనిది ....  
ఏ కొలతలకు అందనిది 
ఏమార్చుతూ పాదరసంలా 
తప్పించుకునేది ... 
గుండెల్లో గూడు కట్టుకుని 
మనసుతో మాత్రమే మమేకమయ్యేది... 

ప్రత్యేకమైన మిషన్ వేసుకుని  
విశేషమైన దృష్టి తోనో 
పటిష్టమైన ప్రణాళికలు వేసుకునో
పట్టుమని సాధించేది కాదు... 
కలగాబులఁగంగా వెదుకులాటతో చిక్కదు 
విసిగి వేసారితే కరుణించదు ..... 

అంతిమ లక్ష్యంగా కాదు అదే చేసుకుని 
ఆది లక్షణంగా అడుగులేసేది ... 
తొలి నుండి అడుగులేస్తూ 
పనిలో పొందే ఆనందమే  
పద్దతిగా పెట్టుబడవ్వాలి .... 


ఆరోగ్యంలో ఉంటుంది 
ఆలోచనలో ఉంటుంది 
ఆశయంలో ఉంటుంది… 
పద్ధతైన పనితీరులో ఉంటుంది ... 
ప్రతి అడుగులో ప్రతి పనిలో 
పక్కన్నే ఉంటుంది పలకరిస్తుంటుంది .... 
అడుగడుగున ప్రతిక్షణం పరమానందం .... 
ఆత్మసాక్షికి అడుగు దూరమే…. 

అనుకున్నవి అనుకున్నట్టు 
అన్నీ అమరిన జీవితంలో 
ఆనందమే జీవిత మకరందం ... 
అలా జరగకున్నా ... అనుక్షణం 
ధనాత్మకమైన సహజ ఆలోచనలే 
ధరణిలోన ఆనందాలకు ఆదిమూలం ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment