ప్లాస్టిక్
తేదీ: 10-07-2024
శీర్షిక : విశ్వభూతం
ఇంతింతై వటుడింతైలా
రోజు రోజుకు పెరిగి పెద్ద మానై
పిల్లలమర్రిలా వ్యాపిస్తూ
విశ్వభూతమై విలసిల్లుతున్నది ...
భూమిలోనే పుట్టినా.... భూమినే
కాకుండా ... వామనునిలా ....
భూమ్యాకాశాలను బద్దలు కొడుతూ
వ్యాపిస్తున్న వింత సంతకం ....
ఉదయాత్పూర్వమే దంత ధావనంతో
మొదలై చేతిలో సంచిగా చేరిపోయి
కాఫీ కప్పులో కాషాయమై ...నీటికి బాటిలై ...
ప్యాకింగుల్లో పట్టుబట్టలా ఒది గిపోయి
పరివ్యాప్తి చెంది పట్టు సాధిస్తున్నది ....
ఎవరి బిడ్డరా అంటే ఎక్కెక్కి
ఏడ్చినట్టు...నిర్వహణలు లోపించి
సర్వ నిర్వీర్యానికి సంకేతం చేస్తూ
పటాటోపంతో ఫరిఢవిల్లుతోంది ....
కాలువల్లో కాలనాగుల్లా బైలెల్లి
నదులలో నాట్యమాడుతూ
సంద్రాలను చేరి ... జలచరాలను
మట్టుబెట్టే రణతంత్రం .....
ఫలితమనుభవించే ప్రజలు
ప్రభుత్వాలు పూనుకుని ....
నివారణలను నిజాయితీగా
అమలు చేయకుంటే సాలెగూడై
అల్లుకుంటుంది .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment