Saturday, July 27, 2024

ఈ తరం స్వరాలు తేది : 07-07-2024 శీర్షిక : తరం మార్పు

 ఈ తరం స్వరాలు

తేది : 07-07-2024
శీర్షిక : తరం మార్పు
సహస్రాధికం .... 

ప్రతి ముప్పదేండ్లకో తరం 
మారుతుందని అనుభవాల పాఠం… 
తరం మారినా… సంస్కృతికి పట్టం
కట్టి ఆత్మీయతలు అనురాగాలు మూట
గట్టాలి…. 

మార్పులోనే పుడతాము 
మార్పులోనే పెరుగుతాము… 
పసిగట్టలేని ప్రగతి పథం 
తిరిగి చూసుకుంటే..అబ్బా 
అనిపించే వినూతనం…. 

కాలినడకల కథలను రాసాము
గాలిమోటరు జీవితమయ్యింది… 
సర్కారు బడిలో సాగిన విద్య 
కాన్వెంటులో కొనసాగతున్నది…. 

వేగం పెరిగిన పరుగులు 
జూదంలాంటి జీవితాలు… 
బ్రతుకుదెరువుల వలసలు
కుదేలవుతున్న బంధాలు…. 

కన్నవారికి మిగిల్చే దుఃఖాలు
వెరసి చితుకుతున్న బతుకు చిత్రం..
చూపుకేమో మేడిపండు మెరుపులు
విప్పి చూసుకుంటే తప్పదీసుడే…. 

కాసులవేటలలో కడలిదాటినా
కన్నవారి కలలు పండిస్తే చాలు… 
ఆత్మీయతలకు అనురాగాలకు
కొదువలేక కొలువగలిగితే చాలు… 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment