Saturday, July 27, 2024

వ్యంగ్యం తేది : 16-05-2024 శీర్షిక : హాస్యం ....

 వ్యంగ్యం 

తేది : 16-05-2024
శీర్షిక : హాస్యం .... 

అష్టదిగ్గజములలో విశిష్టుడైన
వికటకవి తెనాలి కూడా 
వింత చేష్టల కొంత కలిగించే 
హాస్యం...విదూషకుడై రాజుకు .. 
ప్రజలకు ....   

తూటాలను పేల్చేటి తుపాకి 
రామయ్య పాత్ర ... తూర్పార 
పడుతూనే... తుత్తునియలు 
చేస్తూనే నవ్వుల పొట్లం విప్పి 
నట్టింట్లోనే నవ్విస్తుంటాడు...

వ్యంగ్యములకు జంగమయ్య 
చాప్లీను చిరునామయినా 
పిల్లలకు పెద్దలకు ఉల్లాసములే 
వింతగల్ల ఆకారంతో విసుగులను 
దూరం చేయంగా.... 

దర్శనమే దరిచేర్చును ఆనందం 
మాటలు కోటలై దాటిపోతుంటే 
మనకు కూడా ఎంతో కొంత 
తారసమే నిత్య జీవితములో .... 

కానీ కొంతమంది .... కపటములతో 
కళ్ళాపి జల్లి సప్తవర్ణాలతో ముగ్గులేసే 
కరటక దమనకులుంటారనే నిజం 
కూడా కనిపెట్టుకుని కదలాలి లోకంలో ....  

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment