స్మృతుల దొంతర
తేది : 02-04-2024
శీర్షిక : భావ ధార
అంశం వెలుగులో ప్రకాశాన్ని
పట్టుకుందామని అరమోడ్పుల
కనులు మూసుకుంటే ధారలా
ప్రవహించే ధారాళమైన భావ సంపదలు ....
ఒక్కటేమిటి లెక్కలేనన్ని...
ఆటపాటల బాల్యంలో అనుభవాలు
గతించినవే అయినా మతించితే
మహాత్యాల ముత్యాల సరాలు ....
మననమైతే చాలు ... కోటి
దీపకాంతులు కోనేటి మెట్లపై
పెట్టిన అందాలే.. కోమలమైన
నెమలీకలు మోముపై కదలాడినట్టు ....
ఆ నింగిని తాకిన అనుభూతే ...
వంగిన నెలవంకను మీటిన
ఆనందమే ... హిమనదముల
సెలయేళ్లు హరిత లోయలలో ఆనంద
గంతలేసి దూకిన చెవులపిల్లి చందమే ....
సప్తవర్ణ మయూరాల హరివిల్లే
సంపంగి సదనమైన చాపమే…
విందు భోజనాల భుక్తాయాసం
పసందు దృశ్యాల ప్రయోక్తమే…
మారుతున్న నేటి ప్రపంచంలో
మారని నాటి బాల్యం ఎంతో ఘనం ...
మధురమైన స్మృతుల దొంతరే
భవిష్యత్తు బాటకు దిక్సూచులు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment